Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే

Lineup Of Tollywood Star Heroes How Many Films Does Each Person Have In Their Hands

ఇండియన్ సినిమా మార్కెట్ లో టాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్స్ చేయడం లేదు. సొంత భాష దర్శకులనే కాదు పర భాష ఇండస్ట్రీ డైరెక్టర్స్ ను కూడా లైన్ లో పెడుతూ పాన్ ఇండియా మార్కెట్ పై జెండా ఎగరేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోల చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఎవరెవరి లైనప్ ఎలా ఉందొ ఓ సారి పరిశీలిస్తే..

ప్రభాస్ : రాబోయే 5 నుండి 6 సంవత్సరాలు రెబల్ స్టార్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చేయడం లేదు. ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ జనవరి 9న వస్తుంది. దానితో పాటు ఫౌజీ, స్పిరిట్, చేస్తున్నాడు. సలార్ 2, కల్కి 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.

జూనియర్ NTR : ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మిడ్ లో ఈ సినిమాను ఫినిష్ చేసి నెక్ట్స్ త్రివిక్రమ్ లో ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నాడు. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అన్ని కుదిరితే దేవర సీక్వెల్ కూడా ఉండొచ్చు.

రామ్‌చరణ్ : గేమ్ చెంజర్ రిజల్ట్ తో చరణ్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్దితో పాటు సుకుమార్‌తో RC17 కూడా లైన్ లో పెట్టాడు.

మహేశ్ బాబు : రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి మాత్రమే చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 2027 వరకు డేట్స్ ఇచ్చేసాడు మహేశ్

అల్లుఅర్జున్ : అట్లీ డైరెక్షన్ లో AA22 చేస్తున్నాడు, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో అలాగే తమిళ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చర్చలు కొనసాగుతున్నాయి కానీ ఇంకా ఏమీ లాక్ కాలేదు.

పవన్ కళ్యాణ్ : ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్ చేశాడు. OG 2తో పాటు రామ్ తల్లూరి & KVNప్రొడక్షన్ లో సినిమాలు ఉన్నాయి.

Also Read : Tollywood : ‘స్టార్ పవర్ కాదు స్టోరీ యే పవర్’ అని నిరూపించిన చిన్న సినిమాలు