
వరుస ప్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే ఔననే వార్తలు టాలీవుడ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలా వైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు కోటిన్నర నుండి మూడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని టాక్. మేడమ్ శాలరీ పెంచేయడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టేశారన్న వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడమ్ తగ్గించుకుందంట.
Also Read : Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి
దుల్కర్ 41 కోసం పూజా రూ. 3 కోట్లు ఛార్జ్ చేసిందన్నది లేటెస్ట్ బజ్. ఈ లెక్కన చూస్తే జననాయగన్, రెట్రో చిత్రాల కన్నా తక్కువేనని తెలుస్తోంది. రెట్రో కోసం పూజా రూ. 4 కోట్లు తీసుకుంది. అలాగే నెక్ట్స్ ఇయర్ రిలీజయ్యే దళపతి విజయ్ ఫిల్మ్ జననాయగన్ కోసం రూ. 6 కోట్లు వరకు పుచ్చుకుందని సమాచారం. ఇక కూలీలో ఐటమ్ సాంగ్ కోసం రూ. 3 కోట్లు తీసుకున్న పూజా ఇప్పుడు దుల్కర్ మూవీ కోసం జస్ట్ రూ. 3 కోట్లు తీసుకోవడం డిస్కర్షన్కు కారణమైంది. అయితే ఈ రెమ్యునరేషన్ కూడా ఆమెకు ఎక్కువే అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏళ్లు దాటిపోతున్నాయి. అలా వైకుంఠపుం తర్వాత మ్యాజిక్, వండర్స్ క్రియేట్ చేయడంలో తడబడుతోంది. ఇక్కడే అనుకుంటే పొరపాటు సౌత్ టూ నార్త్ ఎక్కడకు వెళ్లినా ఇదే సిచ్యుయేషన్. ఫెయిల్యూరైనా అమ్మడి ఛాన్సులకొచ్చిన కొదవేమీ లేదు. ప్రజెంట్ నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి కానీ సక్సెస్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్స్ డిమాండ్ చేయడానికి ఛాన్సు ఉందని గ్రహించిందేమో.. తగ్గించేసుకున్నట్లు కనిపిస్తోంది మేడమ్.