
90స్ ఏ మిడిల్ క్లాస్ బయో పిక్ ఈ ఒక్క వెబ్ సిరీస్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ మధ్యతరగతి మనసులు చదివి వాటిని తెర మీద నవ్వుల రూపంలో చూపించిన ప్రతిభ అతనిది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు డైరెక్షన్ చేయబోతున్నాడు. నితిన్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సితారలో మరో సినిమా ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో ఆదిత్య హాసన్ పేరు ఇక వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే డైరెక్టర్‌గా మారబోతోంది. అయితే తాను నిర్మించిన స్మాల్ బడ్జెట్ సినిమా లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ ముందు ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో చూశాం. నీదీ నాది ఒకే కథ, విరాట పర్వంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల కూడా అచ్చం అలాంటి ప్రయత్నమే చేశాడు. లో బడ్జెట్ తో్ నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
ఒక రాజు, ఒక రాంబాయి వీళ్ల మధ్య లవ్ వరంగల్ , ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇది ఓ కామన్ లవ్ స్టోరీలా కనిపించినా డైరెక్టర్ సాయిలు కంకిపాటి అంతర్లీన భావోద్వేగాలతో నింపిన రియలిస్టిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మించి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. “స్టార్ పవర్ కాదు స్టోరీ యే పవర్” అని థియేటర్ లో నిరూపించాడు.
పెద్ద కలలు చిన్న హృదయాల్లోనే పుడతాయి. డైరెక్టర్ సాయి మార్తాండ్ విజన్‌పై నమ్మకం ఉంచిన నిర్మాత ఆదిత్య హాసన్ హార్ట్‌టచింగ్ లవ్ డ్రామాతో ప్రేక్షకుడి మనసు గెలుచుకున్నాడు. ఎక్కువ ఖర్చు లేకుండా సినిమా చేయొచ్చని, థియేటర్స్లో బిగ్ హిట్ కొట్టొచ్చని ఏకంగా 40 కోట్లు కొల్లగొట్టిన ఈ ‘లిటిల్ హార్ట్స్’ నిరూపించింది. అనుభూతి చెందే స్టోరీ ఉంటే, సినిమాలో స్టారెవరు, బడ్జెట్ ఏంటో ప్రేక్షకుడు అడగడంలేదు. ఆడియన్స్ ఎప్పుడూ కంటెంట్ కే కనెక్ట్ అవుతున్నాడని ఈ రెండు చిన్న సినిమాలు నిరూపించాయి. కో ఇన్సిడెంట్ గా ఈ రెండు సినిమాలను నిర్మించింది కూడా ఇద్దరు దర్శకులే కావడం విశేషం.