
త్రివిక్రమ్ శ్రీనివాస్–విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో కొత్త సినిమా వస్తుందన్న వార్తతోనే టాలీవుడ్ అభిమానుల్లో భారీ ఉత్సాహం పెరిగిపోయింది. గతంలో ఈ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఫేవరెట్ అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసే ప్రాజెక్ట్ మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక పోతే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఓ పేరుగాంచిన రూమర్ వైరల్ అవుతోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే టైటిల్‌తో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. టైటిల్ చూస్తే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని స్పష్టంగా తెలుస్తోంది. త్రివిక్రమ్ స్టైల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, వెంకీ స్టైల్లో కామెడీ కలిస్తే పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
Also Read : Ranveer Singh : IFFIలో కాంతారాపై రణవీర్ కామెంట్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కన్నడ అభిమానులు..
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. నటీనటులు, కథ, షూటింగ్ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఇప్పటికే మొత్తం ఇండస్ట్రీ ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. త్రివిక్రమ్ ఇటీవల వరుసగా చేసిన పాన్ఇండియా స్థాయి చిత్రాల తర్వాత, వెంకీ తో కలిసి పూర్తి ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం ఓలైన్లో వినిపిస్తున్న టైటిల్ రూమర్ మాత్రమే అభిమానులలో ఇంత హంగామా క్రియేట్ చేస్తే, ఫస్ట్ లుక్, గ్లింప్స్ బయటకు వచ్చిన తర్వాత ఎంత హడావిడి జరుగుతుంది అన్నది ఊహించుకోవచ్చు.