TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్‌ ట్విస్ట్..

Ttd Ghee Scam Former Gm Murali Krishna Named Accused In Sit Chargesheet

TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్‌లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా మారింది. దీంతో కేసులో కొత్త మలుపు తిరిగింది. సిట్ నమోదు చేసిన వివరాల ప్రకారం.. టీటీడీ ఉద్యోగులు 7 మంది, ఇతర వ్యక్తులు, అధికారులు నలుగురితో కలిసి ఇప్పటి వరకుక మొత్తం నిందితుల సంఖ్య 11కు చేరింది..

Read Also: Kashmiri garlic benefits: చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెడుతున్న కాశ్మీరీ వెల్లుల్లి

2018 నుండి 2024 వరకు టీటీడీ కొనుగోలు విభాగంలో జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర రెడ్డి మరియు మురళీకృష్ణ, SV గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్‌లు, జూనియర్ అసిస్టెంట్‌లు కూడా కేసులో నిందితులుగా నమోదు చేశారు.. కాగా, తిరుమల దేవస్థానంలో నైవేద్యంగా ఉపయోగించే నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవడంతో నమూనాలను పరీక్షకు పంపించారు.. అందులో కల్తీ నిర్ధారణ కావడంతో కేసు మొదలైంది.. విచారణలో పెద్ద ఎత్తున కొనుగోలు అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని సిట్ భావిస్తోంది.

మరోవైపు.. ఈ కేసులు కీలక ఆధారాలు సేకరిస్తూ.. సంబంధిత అధికారుల నుండి వివరణ తీసుకుంటూ మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం పరిశీలిస్తోంది. అయితే, టీటీడీ వంటి పవిత్ర సంస్థలో ఇలా ఎలా జరిగింది? అని భక్తులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. నాణ్యత నియంత్రణ వ్యవస్థ ఎందుకు విఫలమైంది? ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారు? అని దానిపై దృష్టి పెట్టింది.. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.. తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనుంది.