
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం తన 19వ ఏట ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్కిన్షోకు తెరలేపినా ఈఅమ్మడికి వచ్చిన ఆఫర్స్ అంతంత మాత్రమే. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లల్లో ఐదు సినిమాలు చేసింది. ఊర్వశి రతౌలా బ్లాక్ రోజ్ సినిమాలోని ఐటంసాంగ్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే బ్లాక్ రోజ్ మూవీలో ఐటంసాంగ్ చేసిన సంగతే తెలీదు. ఆ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు కానీ లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరు సరసన వాల్తేరు వీరయ్యలో ఐటం సాంగ్ చేసిన తర్వాత తెలుగులో బిజీ అయింది.
Also Read : Tollywood : హిట్ పెయిర్స్.. టాలీవుడ్ సెంటిమెంట్స్..
తెలుగులో ఫస్ట్ ఐటం హిట్ కావడంతో ఐటంసాంగ్స్కు ఊర్వశి కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది. వరుసపెట్టి ఏజెంట్, బ్రో, స్కందలో తళుక్కున మెరిసింది రౌతేలా. హిట్ ఐటంగర్ల్ ఊర్వశి కాస్తా రాను రాను ఐరెన్లెగ్ అయిపోయింది. నాలుగు సినిమాలు చేస్తే వార్తేలు వీరయ్య తప్ప బ్రో.. ఏజెంట్..స్కంద నిరాశపరిచాయి. ఇక మరోసారి గ్యాప్ తీసుకుని హ్యాట్రిక్ హీరో బాలయ్య ఆశీస్సులతో డాకు మహారాజ్లో ఏకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో కనిపించింది ఊర్వశి. అదృష్టం బాగుంటే కాంతార చాప్టర్1లో నటించేది ఊర్వశి రౌతేల. ఈ అమ్మడి పేరుప్రకటించినా.. ఎందుకోగానీ.. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు. డాకులో దబిడి దిబిడి సాంగ్ తో ఊపేసింది ఊర్వశి. ఆ సినిమా హిట్టయినా తెలుగులో ఈ అమ్మడికి ఎందుకనో ఛాన్సులు దక్కలేదు. ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో ముంబయి వెళ్ళిపోయింది ఊర్వశి. అదేంటో టాలీవుడ్లో ఒక్కసారిగా మెరిసి మాయమైపోయింది ఊర్వశి.