Varanasi : SS రాజమౌళి వారణాసిలో మహేశ్ బాబు మేనళ్లుడు

Mahesh Babus Nephew In Varanasi

దర్శక దిగ్గజం రాజామౌళి దర్సకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న భారీ చిత్రం వారణాసి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ‘రుద్ర’ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతోంది.

Also Read : Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే

కాగా ఈ షెడ్యూల్ లో మహేశ్ చిన్నప్పటి సన్నివేశాలు తీస్తున్నారు. అయితే మహేశ్ చిన్నప్పటి రోల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ నటిస్తున్నాడని రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ విషయమై వారణాసి టీమ్ ను సంప్రదించగా అసలు అటువంటిది ఏమి లేదని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ కొడుకు నటిస్తున్నాడనేది పక్కా ఫేక్ న్యూస్. ఇక్కడే మరో ఆసక్తికర విషయం తెలిసింది. మహేశ్ చైల్డ్ హుడ్ క్యారక్టర్ లో సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు ప్రిన్స్ మహేశ్ బాబు బావ హీరో సుధీర్ బాబు కుమారుడు దర్శన్ నటిస్తున్నాడు. అందుకు సంబంధించి షూట్ కూడా చేస్తున్నారు. సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఆల్రెడీ అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. దర్శన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీలోను ప్రభాస్ చిన్నప్పటి రోల్ లో దర్శన్ నటించబోతున్నాడు.