What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today On 29th November 2025

* తెలంగాణలో నేటితో ముగియనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు.. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు, వార్డు మెంబర్‌ స్థానాలకు 11,502 నామినేషన్లు దాఖలు

* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు… వారానికి ఒక సారి పార్టీ కార్యాలయానికి వస్తానన్న సీఎం చంద్రబాబు.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై పార్టీ నేతలతో సమావేశం..

* విశాఖపట్నంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యా్‌ణ్ పర్యటన…. నేవీ డే ముందస్తు కార్యక్రమానికి హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి .. సాయంత్రం జరగనున్న కార్యక్రమం….

* అమరావతి: రాజధాని రైతుల సమస్యలపై ఇవాళ ఉదయం 10 గంటలకు త్రి సభ్య కమిటీ సమావేశం.. అమరావతి రైతుల సమస్యలపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. మంత్రి నారాయణ. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ లతో త్రి సభ్య కమిటీ. ఇప్పటికే రెండు సార్లు త్రి సభ్య కమిటీ సమావేశం

* శ్రీకాకుళం: నేడు గార మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోండు శంకర్.

* నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను.. కారైకాల్ కి 220 కి,మీ., పుదుచ్చేరికి 330 కి.మీ., చెన్నైకి 430 కి.మీ దూరంలో కేంద్రీకృతం.. రేపు తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం.. దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.. బాపట్ల,పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన

* హైదరాబాద్‌: నేడు ఉదయం 11 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చ కొరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు ఆధారాలతో సహా వస్తానని బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్

* తిరుమల: వైకుంఠద్వార దర్శనం కోసం ఆన్ లైన్ లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు.. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం .. డిసెంబర్ 2వ తేదీన ఈ డిఫ్ విధానంలో దర్శన టోకెన్లు జారీ

* విశాఖ: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. మెడికల్ కాలేజీలు PPP విధానం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమావేశం…

* తిరుపతి: దిత్వా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా యంత్రాంగం – 24/7 లైన్ డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

* తిరుమల: 18 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,044 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,559 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు

* నేడు వరంగల్ జిల్లా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన .. వందే భారత్ రైల్‌లో వరంగల్ చేరుకుని.. హన్మకొండలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు.. వేయి స్తంభాల గుడిలోని రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.. కాజీపేట లోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనులను పరిశీలిస్తారు .. నక్కలగుట్ట హరిత హోటల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష సమావేశం..