Winter Eye Problems: చలి పెరుగుతోంది.. మీ కళ్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.. లేదంటే చాలా ప్రమాదం..!

Winter Eye Care Problems Tips Dry Eyes Infections

Winter Eye Problems Rising: చలికాలం మొదలైంది. చలి రోజు రోజుకూ పెరుగుతోంది. చలికాలం మొదలయ్యాక చల్లని గాలులతో పాటు మన కళ్లపై పడే భారం కూడా పెరుగుతుంది. రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న అసౌకర్యాలుగా కనిపించే సమస్యలు, అసలు లోతులో తీవ్రమైన కంటి వ్యాధులకు సంకేతమై ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో కళ్లలో వాపు, ఎర్రబారడం లేదా నీరు కారడం వంటి లక్షణాలు వివపరీతంగా పెరుగుతాయి. కేవలం వాతారణతోనే కాకుండా.. కళ్ల ఉపరితలం తన సహజ రక్షణ పొరను కోల్పోవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. గాలిలో తేమ తీవ్రంగా తగ్గిపోవడం వల్ల కంటి కణజాలం త్వరగా పొడిబారి, అక్కడి నరాలు సున్నితంగా మారతాయి.

READ MORE: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. శాశ్వతంగా ఆ దేశాల నుంచి వలసల నిలిపివేత

ఈ సీజన్‌లో కనిపించే బ్లెఫారిటిస్‌, కండ్లకలక వంటి ఇన్ఫెక్షన్లు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. మరికొందరిలో డ్రై ఐ సమస్య అంతగా తీవ్రమై, రాత్రివేళల్లో కళ్లను తెరవడం, మూయడం కూడా బాధగా మారుతోంది. కొన్నిసార్లు రెటీనా సంబంధిత సమస్యలు కూడా చలికాలంలో ప్రబలుతుండటంతో, చిన్న లక్షణాన్నైనా వదిలేయకుండా నిపుణుల సహాయం తీసుకోవడం తప్పనిసరిగా మారుతుంది. నిపుణుల సూచనల ప్రకారం.. ఈ కాలంలో సహజ తేమను నిలుపుకోడం చాలా ముఖ్యం. చలిగాలులు కళ్లలోని తడి పొరను తొందరగా ఆరబెట్టేస్తాయి. అందుకే కళ్లను తరచూ శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ వేసుకోవడం, దుమ్ము గాలుల నుంచి కళ్లను కప్పి ఉంచడం అవసరం. చలికాలంలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుందన్న విషయాన్ని చాలా మందికి తెలియదు. ఇది నేరుగా కళ్లపై ప్రభావం చూపుతుంది. రోజుకు తగినంత నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే తగినంత నిద్ర కూడా కళ్ల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలోనే కంటి కణజాలం మరమ్మత్తు జరిగే అవకాశం ఉండటంతో 7–8 గంటల నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు.

READ MORE: Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్!

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.