
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలం ముగిసిన విషయం తెలిసిందే. సీజన్ సీజన్‌కూ పాపులర్ అవుతున్న డబ్ల్యూపీఎల్‌లో క్రికెటర్ల వేలం ధర కూడా పైపైకి వెళ్తోంది. తాజా వేలంలో 2025 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులపై కాసుల వర్షం కురిసింది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ లీగ్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికింది. యూపీ వారియర్సే ఆమెను రూ.3.2 కోట్లకు కైవసం చేసుకుంది. దాంతో దీప్తి ఈ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ల జాబితాలో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (రూ.3.4 కోట్లు) తర్వాత దీప్తి రెండో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ 2026 డబ్ల్యూపీఎల్ వేలంలో రెండో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. ముంబై రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. రెండేళ్లుగా భారత్‌కు ఆడని ఆల్‌రౌండర్ శిఖ పాండేను వారియర్స్ ఏకంగా రూ.2.4 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. సోఫీ డివైన్ (రూ.2 కోట్లు), అమేలియా కెర్ (రూ.3 కోట్లు), మెగ్ లానింగ్ (రూ.1.9 కోట్లు), షినెల్ హెన్రీ (రూ.1.3 కోట్లు), శ్రీచరణి (రూ.1.3 కోట్లు)లకు కూడా భారీ ధర దక్కింది.
ఖరీదైన ప్లేయర్లు లిస్ట్:
# దీప్తి శర్మ: రూ.3.2 కోట్లు (యూపీ వారియర్స్)
# అమేలియా కెర్: రూ. 3 కోట్లు (ముంబై ఇండియన్స్)
# శిఖ పాండే: రూ.2.4 కోట్లు (యూపీ వారియర్స్)
# సోఫీ డివైన్: రూ. 2 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
# మెగ్ లానింగ్: రూ.1.9 కోట్లు (యూపీ వారియర్స్)
# షినెల్ హెన్రీ: రూ.1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
# శ్రీచరణి: రూ.1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
# ఫోబే లిచిఫీల్డ్: రూ.1.20 కోట్లు (యూపీ వారియర్స్)
# లారా వొల్వర్ట్: రూ. 1.10 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
# ఆశా శోభన: రూ. 1.10 కోట్లు (యూపీ వారియర్స్)