
Zonal System In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ పట్నం, అమరావతి, రాయలసీమ జోన్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విశాఖ రీజియన్‌లో 9 జిల్లాలు, అమరావతిలో 8 జిల్లాలు, రాయలసీమ జోన్‌లో 9 జిల్లాలు ఉండనున్నాయి. ఇక, నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు
Read Also: Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి
అయితే, ఒక్కో జోన్‌కు సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారులని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక, విశాఖపట్నం జోన్‌కు సీఈవోగా యువరాజ్ ని నియమించగా.. అమరావతి జోన్‌కు సీఈవోగా మీనా.. రాయలసీమ జోన్ కు సీఈవోగా కృష్ణబాబున నియమించనున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.